విశాఖ ఆర్చ్‌బిషప్‌గా ఉడుమల బాలను ప్రతిష్టాపించిన పోప్ ప్రతినిధి
వేల మంది ప్రజల సాక్షిగా, ఘనంగా, ఆధ్యాత్మిక పండుగగా సాగిన వేడుకలో మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల

“ఐక్యత, అభివృద్ధి, సామరస్యంతో ఉత్తమ వైజాగ్, ఉత్తమ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నదే నా అజెండా”: ఆర్చ్‌బిషప్ బాల
తన తొలి ప్రసంగంలో ఉడుమల బాల “వరంగల్ నా జన్మభూమి అయితే – విశాఖ నా పుణ్యభూమి,” అని అన్నారు. వరంగల్ నుంచి, పవిత్ర భూమి వైజాగ్‌కు రావడం దేవుని కృప అని నమ్ముతున్నానన్నారు. గొప్ప మనస్సు కలిగిన ప్రజల మధ్య సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఐక్యత, శాంతి, సహకారం, అందరి మతాల మధ్య సామరస్యమే తమ లక్ష్యమని చెప్పారు. "విశాఖ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు. కలిసికట్టుగా మెరుగైన విశాఖ, మెరుగైన ఆంధ్రప్రదేశ్, మెరుగైన భారత్ ను నిర్మిద్దాం,” అని పిలుపునిచ్చారు.
ఆర్చ్డియోసెస్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా ఆర్చ్ బిషప్ లియోపోల్డో గిరెల్లి స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, వలసదారుల దీన పరిస్థితి, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలు తీవ్రమైనవి అయినప్పటికీ, చర్చి క్రీస్తు వెలుగులో మరింత ప్రకాశవంతంగా, అర్థవంతంగా ముందుకు సాగడానికి అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.