Fri Apr 04 2025 08:26:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పాపికొండల యాత్రలు నేటి నుంచే
నేటి నుంచి పాపికొండల యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు నెలల తర్వాత ప్రారంభం కానుంది

నేటి నుంచి పాపికొండల యాత్ర ప్రారంభం కానుంది. పాపికొండల యాత్ర కోసం పర్యాటకులు వెయిట్ చేస్తుంటారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో కొంత కాలం నుంచి పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాపికొండలను బోట్ల ద్వారా చూడాలనుకున్నవారు నిరాశకు గురయ్యారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకూ, రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ ఈ యాత్ర సాగనుంది.
నాలుగు నెలల తర్వాత...
అయితే ప్రస్తుతం గోదావరి నీటి మట్టం నిలకడగా సాగనుండటంతో నాలుగు నెలల తర్వాత పాపికొండల యాత్ర ప్రారంభం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం టూరిజం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి టూరిజం బోట్లు బయల్దేరనున్నాయి. దీంతో పర్యాటకులతో పాటు బోటు యజమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story