Sun Dec 22 2024 16:19:55 GMT+0000 (Coordinated Universal Time)
పాపికొండలకు విహారయాత్రకు బ్రేక్
పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. అధికారుల బోటింగ్ ను నిలిపేశారు.
పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. అధికారుల బోటింగ్ ను నిలిపేశారు. గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు ఎక్కువ మంది జనం వస్తారు. ఇటు రాజమండ్రి, అటు భద్రాచలం ప్రాంతం నుంచి బోట్లు బయలుదేరతాయి. అయితే పాపికొండల విహారయాత్రను నిలిపివేసినట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం పర్యటన ఉండటంతో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు పాపికొండల విహారయాత్రకు బ్రేక్ వేశారు. దీంతో విహార యాత్ర చేయాలని వచ్చిన వారికి నిరాశ ఎదురయింది.
Next Story