Fri Nov 22 2024 23:30:48 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ ఎఫెక్ట్ : ఏపీలోనూ లాక్ డౌన్ తప్పదా ?
రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కేసులు.. ఆందోళన పెంచుతున్నాయి. కేసులను ఎలా కట్టడి చేయాలో తెలియక
కరోనా థర్డ్ వేవ్.. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం.. స్వదేశం.. పొరుగు దేశమన్న తేడా లేకుండా అందరికీ చుక్కలు చూపిస్తూ.. కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ లోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పాక్షిక లాక్ డౌన్లు, వారాంతపు లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తే.. వైరస్ తీవ్రతను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజాగా ఏపీ కూడా అదే బాటలో వెళ్లే అవకాశముందంటూ వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కేసులు.. ఆందోళన పెంచుతున్నాయి. కేసులను ఎలా కట్టడి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగానే పాక్షిక లాక్ డౌన్ విధిస్తే మంచిదన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అనుమతులిచ్చి.. ఆ తర్వాతి నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత ఉందన్నది తెలియాలంటే.. ప్రభుత్వం స్పందించాల్సిందే.
Next Story