Sun Dec 22 2024 13:11:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : టీడీపీ క్యాడర్ ఆవేశంగా ఉంది : చంద్రబాబు
టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి చాలా క్యాడర్ కష్టపడ్డారన్నారు. టీడీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా ఆవేశంగా ఉన్నారని తెలిపారు. హర్యానాలో ప్రధాని మోదీ ఐదు గంటల పాటు గడిపారని, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అందరినీ కోరారని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని నాశనం చేశారని చంద్రబాబు అన్నారు. కేడర్ లో భారీగా అంచనాలు ఉన్నాయని, కానీ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారం కావన్న విషయం వెంటనే గమనించాలని చంద్రబాబు అన్నారు. వ్యవస్థల ప్రక్షాళనకు చాలా సమయం పట్టేలా ఉందని చంద్రబాబు అన్నారు. అధికారం కోసం తెలుగుదేశం పార్టీ ఏనాడూ పనిచేయలేదని చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు కలసి పనిచేస్తేనే మరోసారి విజయం సాధ్యమవతుందని అన్నారు. టీడీపీకి విశ్వసనీయత ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ ఎన్నికల్లో సోషల్ ఇంజినీరింగ్ చేశామన్నారు. ఎందరికో సీట్లు ఇవ్వకపోయినా వారు త్యాగాలు చేసి పార్టీ విజయం కోసం పనిచేశారన్నారు. గెలిచాం కాబట్టి మన పని అయిపోయిందనుకుంటే సరిపోదని, కష్టపడాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Next Story