Tue Dec 24 2024 12:54:26 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాక్ చేస్తున్నా.... జాగ్రత్త.. బాబు వార్నింగ్
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జులకు ఆ పార్టీ అధినేత హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది.
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జులకు ఆ పార్టీ అధినేత హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఫీల్డ్ లో పనిచేస్తున్నారో? ఎవరు పని చేయకుండా తన వద్దకు వచ్చి మాటలు చెబుతున్నారో తనకు తెలుసునని చంద్రబాబు అన్నారు. మూడేళ్ల నుంచి ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తనకు తెలుసునని తెలిపారు.
అభ్యర్థులు ఎవరనేది.....
అన్ని నియోజకవర్గాలను తాను ట్రాక్ చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నది తాను మాత్రమే ఫైనల్ చేస్తానని చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అందరి డేటా తన వద్ద ఉందని, ఎవరు పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో? ఎవరు మౌనంగా ఉన్నారో తనకు తెలుసునని అన్నారు. టీడీపీ పని అయిపోయిందని జగన్ సంబరపడ్డారని, కానీ ఈరోజు టీడీపీని చూడసి జగన్ భయపడుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, అందరూ కలసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు చెప్పారు.
Next Story