Fri Dec 20 2024 14:40:04 GMT+0000 (Coordinated Universal Time)
రేపు పవన్ అంతా చెబుతారు
జనసేన భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఏపీ రాజకీయాలకకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
జనసేన భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రేపు జనసేన ఆవిర్భావ సభ పండగ వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ అహంకారానికి, ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా నాదెండ్ల మనోహర్ అభివర్ణించారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుందని, సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరును పెట్టామని చెప్పారు.
ఆంక్షలు పెడితే ఊరుకోం....
జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పారన్నారు. ప్రభుత్వం సభకు ఆటంకం కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. చివరకు వారధి మీద ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీలను తొలగించారని నాదెండ్ల మనోహర్ మండి పడ్డారు. సభకు వచ్చే తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన పోలీసులను కోరారు. పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని, పెట్టినా తాము బెదిరేది లేదని ఆయన హెచ్చరించారు.
Next Story