Sun Dec 22 2024 21:24:43 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేటి నుంచి టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండే నేతలు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండే నేతలను పార్టీ కార్యాలయం ప్రకటించింది
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావేదికలో సోమవారం నుంచి పాల్గొనే నాయకుల వివరాలను ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలు వచ్చి తమ సమస్యలను తెలుసుకోవచ్చని తెలిపారు.
వీరికి సమస్యలు...
ీఈనెల 11న మాజీ మంత్రి కేఎస్ జవహర్, మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, 12న ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, లిడ్క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, 13న నెట్టం రఘురాం, శాప్ ఛైర్మన్ రవినాయుడు, 14న ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, 15న ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, పట్టాభిరామ్, 16న అబ్దుల్ అజీజ్, గండి బాబ్జీ పాల్గొంటారని పేర్కొంది.
Next Story