Mon Dec 23 2024 13:12:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అదే
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పార్వతీపురం మన్యం జిల్లాను కేంద్ర హోంశాఖ గుర్తించింది
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పార్వతీపురం మన్యం జిల్లాను కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాు, తూర్పు గోదావరి జిల్లాలున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో...
ఈ మేరకు కేంద్రహోంశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.గతంలో విజయనగరం జిల్లా మాత్రమే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగాఉండేది. అయితే జిల్లాల విభజనతో విజయనగరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి లేనట్లయింది. మావోయిస్టులు పార్వతీపురం మన్యంలో ఎక్కువగా ఉండటంతో ఆ జిల్లాను గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Next Story