Sat Nov 23 2024 00:13:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఇద్దరు మంత్రులకూ పవన్ అభిమానుల సెగ
ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోని పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. సినిమాల పట్ల, పవన్ పట్ల
ప్రపంచ వ్యాప్తంగా నేడు భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షో లు పూర్తవ్వగా.. మరికొన్ని ప్రాంతాల్లో మార్నింగ్ షో లు పడ్డాయి. ప్రీమియర్ షో లతోనే భీమ్లా నాయక్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలంగాణలో నేడు ఐదు షో లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు.. టికెట్లను పెంచుకునే వెసులుబాటును కల్పించారు. ఏపీలో మాత్రం పరిస్థితి ఏం మారలేదు. భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకు హెచ్చరికలు జారీ చేయడంతో పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బెనిఫిట్ షో లను రద్దు చేయడంతో పాటు.. ఎక్స్ ట్రా షో లను వేయకూడదని, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువగా రేట్లకు టికెట్లు అమ్మరాదంటూ థియేటర్లకు నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోని పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. సినిమాల పట్ల, పవన్ పట్ల ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోంది అంటూ ఆందోళనలు చేపట్టారు. నిన్న రాత్రి నుంచే ఏపీలో పలు థియేటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాశారు పవన్ అభిమానులు. అయినా షోలు వేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ అభిమానుల నిరసన సెగ రాష్ట్ర మంత్రులైన పేర్నినాని, కొడాలి నాని లకు తగులుతోంది. నేడు మంత్రి కొడాలి నాని, పేర్నినాని గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు. థియేటర్ వద్ద వారిద్దరినీ అడ్డుకునేందుకు పవ్ అభిమానులు, జనసేన నాయకులు ప్రయత్నించారు.
Also Read : గుంటూరులో పవన్ అభిమానులు రచ్చ
థియేటర్ వద్ద మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. సినిమాల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తమవ్వడంతో.. గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని జనసేన పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
News Summary - Pawan fans and Janasena leaders protest against the ministers who came to the theater opening
Next Story