Fri Nov 22 2024 21:05:00 GMT+0000 (Coordinated Universal Time)
జనసైనికులు.. వైసీపీ ట్రాప్ లో పడిపోయారన్న పవన్
ఇటీవల పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా వివాదాల్లో ఇరుక్కున్న
ఇటీవల పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే..! ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. రాజకీయాల్లోకి సినిమాను తీసుకురావద్దని అన్నారు. నా సినిమా గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇష్యూను డైవర్ట్ చేసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. సినిమా గురించి, నన్ను తిట్టడం గురించి డిబేట్స్ ఎందుకు..? పొలిటికల్ డిబేట్స్ను కొంతమంది తప్పుదోవ పట్టించి జనసేన నేతలను రెచ్చగొడుతున్నారన్నారు. సినిమా అనేది తనకు అవసరమని, రాజకీయాల్లో ఇదే తనకు ఇంధనమని, ఆ ఇంధనాన్ని తీసుకెళ్లి ప్రజల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నానని పవన్ అన్నారు.
మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమాను రాజకీయాల్లోకి తీసుకు రావొద్దని అన్నారు. అభిమానులు ఇలా చేస్తే పర్వాలేదు.. కానీ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు సినిమా డిబేట్లోకి వెళ్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదే నా ఫైనల్ రిక్వెస్ట్ అని అన్నారు. నన్ను తిట్టారని మీరు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. మన జనసేనకు భాష ముఖ్యం.. విధానాలపై ప్రశ్నించండి. నా సినిమాను నేనే వదిలేశాను.. మీరు ఎందుకు ఆవేశపడతారు..?. కావాలనే చేసే కుట్రలో మీరు చిక్కుకోవద్దు. డిబేట్ తాలూకూ స్థాయి జనసేన నాయకుల ద్వారా పెరగాలి. వాళ్ల స్థాయికి మీరు దిగజారవద్దు. నన్ను తిడితే నా శరీరం ఏమీ చిల్లు పడిపోదు కదా. మనం ఏది మాట్లాడినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేలా ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్.
Next Story