Mon Dec 23 2024 10:53:46 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లందనీ నేను అనడం లేదు
వాలంటీర్లంతా తప్పు చేస్తున్నారు అని నేను చెప్పడం లేదన్నారు. తులసి వనంలో గంజాయి మొక్క ఒక్కటి ఉన్నా ప్రమాదం.. పది మంచి
• సున్నితమైన సమాచారం బయటకు వెళ్తోంది
• వాలంటీర్లందనీ నేను అనడం లేదు
• కొందరు తప్పు చేసినా అందరికీ మచ్చే
• సమాచారం ఇచ్చే ముందు ప్రజలు ప్రశ్నించాలి
• వాలంటీర్ల సమాచారం అంతా పోలీసుల వద్ద ఉండాలి
• వాలంటీర్ల విషయంలో ఆడ బిడ్డలున్నవారు అప్రమత్తంగా ఉండాలి
• భవిష్యత్తులో నియంత వ్యవస్థ తయారు చేయాలన్నదే జగన్ ప్లాన్
• ఏలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో పవన్ కళ్యాణ్
'వాలంటీర్ల విషయంలో ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఓ వాలంటీర్లకు సమాచారం ఇచ్చే ముందు వారిని ఎందుకు తీసుకుంటున్నారో అడగండి. అవసరానికి మించి సమాచారం ఇవ్వకండి' అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
వాలంటీర్లంతా తప్పు చేస్తున్నారు అని నేను చెప్పడం లేదన్నారు. తులసి వనంలో గంజాయి మొక్క ఒక్కటి ఉన్నా ప్రమాదం.. పది మంచి పళ్లున్న గంపలో ఒక కుళ్లిపోయిన పండు ఉంటే మొత్తం గంపను కుళ్లిపోయిన గంపగానే భావిస్తారు. అలాగే కొందరు తప్పు చేసినా వాలంటీరు వ్యవస్థనంతా అంటారని చెప్పారు. ప్రభుత్వ శాఖల సిబ్బంది ఉండగా, జగన్ సమాంతర వ్యవస్థను నెలకొల్పాడనీ,. ప్రజా ధనం వినియోగిస్తూ... వైసీపీకి అనుకూలంగా పనిచేయిస్తున్నాడని చెప్పారు. వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం ఏలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు జన సైనికులు, వీర మహిళల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "నియంతల ఆలోచన ఉన్న జగన్ మన ఇంట్లోకి వచ్చి మనందరినీ కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. వాలంటీర్లను ప్రజలంతా ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఈ వ్యవస్థ అత్యంత ప్రమాదరకంగా మారుతుంది.
జగన్.. నువ్వేం కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్
నేను వాలంటీర్ల మీద అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. జగన్ నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు. కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. కచ్చితంగా రాబోయే విపత్తును ముందే చెబుతున్నాను. నాకు తెలిసిన కీలకమైన సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తూనే ఉంటా. వాలంటీర్లు ప్రతి ఇల్లు తిరుగుతూ సమాచారం అడుగుతున్నారు. ప్రతి ఇంటి డేటా తీసుకుంటున్నారు. ఎంత మంది ఉంటున్నారు..? వారేం చేస్తున్నారు..? ఎప్పుడు బయటకు వెళ్తారు..? ఎలా వెళ్తారు..? వారి బంధువులు ఎవరు ఇలా అన్ని కీలకమైన వివరాలు తీసుకుంటున్నారు. మైక్రో లెవల్లో సున్నిత సమాచారం తీసుకొంటున్నారు. ఈ సమాచారం పక్కదోవ పట్టే
అవకాశం ఉంది. గ్రామాల్లో అతి సున్నితమైన సమాచారం ఎటు వెళ్తుందో, ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు. అది ఒక్కోసారి వాలంటీర్లకు తెలియకుండా కూడా బయటకు వెళ్తోంది. వాలంటీర్లు అందరినీ నేను అనడం లేదు. తప్పు పట్టడం లేదు. వాలంటీర్ల వద్ద ఉన్న కొంత సమాచారం బయటకు వెళ్తోంది. ‘‘బాగున్నారా బ్యాచ్’’ అని పేరు పెట్టి, శాఖల వ్యవస్థలను నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థను ఎందుకు వైసీపీ ప్రోత్సహిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఎందుకీ సమాచారం
వైసీపీ పార్టీ కోసం పని చేసే వారు అయితే సమాచారం ఎందుకు..? ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు అసలు ప్రజలు ఎందుకు వారికి సహకరించాలి..? ప్రజల ధనంతో జీతాలు ఇస్తున్నపుడు వారు ఎవరో మాకు తెలియాలి. ప్రజలకు పూర్తి వివరాలు తెలియాలి. వాలంటీర్ల సమాచారం కచ్చితంగా ప్రతి జిల్లా ఎస్పీ దగ్గర ఉండాలి. కచ్చితంగా వాలంటీర్లు ఇబ్బంది పెడితే ప్రజలకు పోలీసులు అండగా నిలబడాలి. ఈ కొత్త నియంత వ్యవస్థల్లోని లోపాలు మొదట కనిపించవు. ఒక దాని తర్వాత ఒకటి బయట పడుతుంది. అప్పటికి మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాం. నేను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. వాళ్ల పని వాళ్లు చేస్తే పర్వాలేదు. అధికార పార్టీ కోసమే వారు పనిచేస్తే మాత్రం ప్రజలు కచ్చితంగా అడగండి.
జగన్ కంటే బ్రిటీషు వారు నయం
జనసేన పార్టీ ఇంత బలంగా ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్య కంటకులకు భయంగా ఉంది. వైసీపీ లాంటి పార్టీకి బైబై చెప్పాలంటే మనలో ఎంత గుండె ధైర్యం ఉందో ప్రజలకు అర్ధం అవుతుంది. జగన్ అనే వ్యక్తి బాగా పాలిస్తే, నాకంటే ఆనందించే వ్యక్తి ఉండడు. కానీ అలా జరగడం లేదన్నదే నా బాధ. ఏలూరు డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులు చెట్ల కింద చదువుతున్నారు. వారికి భవనం కట్టాలంటే బటన్లు పనిచేయవు. జగన్ పాలన కంటే బ్రిటీషు వారు కాస్త నయం. నాడు మాకొద్దీ తెల్లదొరతనం అని అప్పట్లో అన్నారంటే... ఇప్పుడు ఉంటే మాకొద్దీ నల్లదొరతనం అనేవారు. మార్పును నేను మెల్లగా తీసుకొచ్చే క్రమంలో కచ్చితంగా అద్భుతమైన కొత్త రాజకీయాన్ని తీసుకొస్తాను. విద్యార్థులకు కనీసం సరైన కళాశాల లేదంటే మనం ఎక్కడున్నాం..? ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే ఎలా..? కూపస్థ మండూకంలా ఎప్పుడూ బతకకూడదు. జగన్ కరెక్ట్ కాదా..? పవన్ కరెక్ట్ కాదా..? అనేది ప్రజలు సొంతంగా ఆలోచించండి.
దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి స్థానానికి జగన్ విలువ ఇవ్వడం లేదు. స్థాయి మరచి దిగజారి నా గురించి మాట్లాడుతుంటే నేను నువ్వు అనే అంటాను. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చావు. ఆయుధం లేకుండా చేసే యుద్ధమే ప్రజాస్వామ్యం. మధ్య యుగంలోనూ నీతి ఉండేది. ఆడవాళ్ల జోలికి, పిల్లల జోలికి వచ్చేవారు కాదు. ఛత్రపతి శివాజీ సైతం ఎప్పుడూ శత్రువుల ఇళ్లలోని ఆడవాళ్ల జోలికి వెళ్లలేదు. అది మన సంస్కృతి. జగన్ అనే వ్యక్తి ఇంట్లో కూర్చొన్న ఆడవారి మీద మాట్లాడుతుంటే ఇంకేం ఆయనకు గౌరవం ఎందుకు ఇస్తాం..?
నాయకుడి ప్రవర్తన సరళి సమాజం మీద పడుతుంది. నాయకుడే తప్పుగా మాట్లాడుతుంటే, కార్యకర్తలు ఏం చేస్తారు..? గతంలో చంద్రబాబు గారి భార్యను అంటే కచ్చితంగా మనకెందుకు అనుకోలేదు. దానిని మనం ఖండించాం. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఖండించాల్సిందే. బాపట్ల జిల్లా రెడ్డివారి పల్లెలో ఓ ఆడబిడ్డను వేధించారని అడిగిన బాలుడ్ని వైసీపీ వాళ్లు పెట్రోలు పోసి కాల్చి హత్య చేశారు. నాయకుడు గతి తప్పితే... కార్యకర్తలకు మతి తప్పుతుంది అనడానికి అదే నిదర్శనం.
Next Story