Mon Dec 23 2024 10:52:47 GMT+0000 (Coordinated Universal Time)
12న శ్రీకాకుళంలో జనసేన "యువశక్తి సభ" : పవన్ కల్యాణ్
ఈ నెల 12న రణస్థలంలో యువశక్తి సభ జరగనుందని తెలుపుతూ.. వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి పేరిట జనవరి 12న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈనెల 12న రణస్థలంలో యువశక్తి సభ జరగనుందని తెలుపుతూ.. వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతి రోజున ఆయన స్ఫూర్తితో జనసేన యువశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువగళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందన్నారు. యువతీ యువకులంతా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని పవన్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. భారతదేశానికి యువత వెన్నెముక అని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని అన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు, విద్యా, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభ ఉంటుందని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ సభలో యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే వినే కార్యక్రమం చేబడుతున్నామని తెలిపారు.
Next Story