Tue Dec 24 2024 18:33:20 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీరాజ్, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న సమయంలో ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలను చేశారు.
వరస సమావేశాలు...
బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. తర్వాత 12 గంటలకు గ్రూప్ 1, 2 అధికారులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. తర్వాత పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖపై సమీక్ష చేయనున్నారు. పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ తోనూ పవన్ భేటీ కానున్నారు.
Next Story