మాస్ వార్నింగ్ లు ఇస్తున్న పవన్ కళ్యాణ్
ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి పై చాలా ఫిర్యాదులు వచ్చాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. క్రిమినల్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాలను ప్రభావితం చేస్తానంటే తాను ఒప్పుకోనని అన్నారు. రౌడీయిజం చేసే వాళ్లకు తానెప్పుడూ వ్యతిరేకినని.. తనను పాలించేవాళ్లు, సీఎంగానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయి ఉండాలన్నారు. అంబేద్కర్ గురించి, గాంధీ, భగత్ సింగ్ గురించి చదువుకో అంటారు. కానీ పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి. సీఎం క్రిమినల్స్ కు అండగా ఉంటే ఏం చేయాలని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడు అయినందుకు నా పొలిటికల్ జర్నీ ఆలస్యమైంది. 2009 నుంచే పాలిటిక్స్ లో ఉండి ఉంటే వైసీపీ అధికారంలోకి రాకుండే చేసేవాడ్ని అన్నారు పవన్. ఆవేశంగా కాదు ఆలోచించి మాట్లాడుతున్నాను. నా మాటలకు బాధ్యత తీసుకుంటానన్నారు.