Mon Dec 23 2024 06:37:19 GMT+0000 (Coordinated Universal Time)
నాటి అవినీతికి నేడు అప్డేట్ వర్షన్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ప్రస్తుతం అప్డేట్ వర్షన్ వచ్చిందని పయ్యావుల కేశవ్ అన్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ప్రస్తుత ప్రభుత్వంలో అప్డేట్ వర్షన్ వచ్చిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మూడేళ్లలో లాండ్, శాండ్, వైన్, మైనింగ్ లలో రెండు లక్షల కోట్ల అవినీతికి జగన్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. లేపాక్షి అవినీతిని బయటపెట్టామని తమ పార్టీ నేతలపై కుప్పంలో దాడులు చేయించారని పయ్యావుల కేశవ్ అన్నారు.
చీఫ్ మినిస్టర్ రెవెన్యూ ఫండ్...
చంద్రబాబు హయాంలో ఏపీ బ్రేవరేజెస్ నుంచి చీఫ్ మినిస్టర్ ఫండ్ కు నిధులు వెళ్లేవని, కాని నేడు చీఫ్ మినిస్టర్ రెవెన్యూ ఫండ్ కు వెళుతున్నాయన్నారు. చంద్రబాబు ఉచితంగా ఇసుకను రవాణా చేస్తే ఈ ప్రభుత్వంలో మాఫియా దోచుకుంటుందన్నారు. ఓబులాపురం మైనింగ్ లో గాలి జనార్థన్ రెడ్డి, జగన్ రెడ్డిలు మళ్లీ దోచుకోవడం మొదలు పెట్టారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story