Sun Dec 14 2025 23:26:24 GMT+0000 (Coordinated Universal Time)
పోరాటంతోనే ముందుకు వెళ్లాలి : ఎస్ షర్మిల
పోరాటాల ద్వారానే ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని వైఎస్ షర్మిల నాయకులకు పిలుపు నిచ్చారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమీక్ష సమావేశాల్లో పలు కీలక అంశాలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చర్చిస్తున్నారు. రాష్ట్రంలో క్రెడిబులిటి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల అన్నారు. మత రాజకీయాలు చేస్తున్నందుకు బీజేపీ, హామీలిచ్చి మోసం చేసినందుకు వైసీపీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చేతులెత్తేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు క్రెడిబులిటి లేదని ప్రజలకు అర్థమైందన్నారు.
క్రెడిబులిటీ లేక...
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, నియోజకవర్గాల వారీగా ప్రతి వారం రెండు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్యాడర్లో నూతన ఉత్తేజం నింపాలని నియోజకవర్గాల కార్యకర్తలకు వైఎస్ షర్మిల సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనునిత్యం పోరాటాల్లో ఉంటూ ప్రజల పక్షాన నిలవాలని వైఎస్ షర్మిల నేతలకు పిలుపునిచ్చారు.
Next Story

