Sun Dec 22 2024 15:14:27 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : అవినాష్ కు జగన్ టిక్కెట్ ఇచ్చింది అందుకే
పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప టౌన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప టౌన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే...అన్ని హామీలు ఫ్యాన్ గాలికి కొట్టుకు పోయాయని అన్నారు. ఇచ్చిన అధికారాన్ని అక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ముఖ్యులంతా ఒక ముఠాగా తయారయ్యారని షర్మిల ఆరోపించారు. కడప లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. వైసీపీ, టీడీపీ ఇద్దరు బీజేపీ కి తొత్తులుగా, బానిసలుగా మారారని వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ఈ దేశంలో మతాల మద్య చిచ్చు పెడుతుందని, మతాలను వేరు చేసి చూస్తుందని, మతాల మధ్య మంటలు పెడుతుందని అన్నారు.
బీజేపీతో నేరుగా...
చంద్రబాబు బీజేపీ తో నేరుగా పొత్తు కున్నారని, జగన్ బీజేపీకి తొత్తుగా మారారన్నారు. ఇద్దరికీ ఓటు వేసినా.. బీజేపీ కి ఓటు వేసినట్లే నని షర్మిల అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ముస్లింలకు భద్రత దొరుకుతుందన్నారు గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బాబు,జగన్ సర్వ నాశనం చేశారననారు. అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి నెట్టారన్నారు. రాష్ట్రానికి హోదా లేదు..రాజధాని లేదు - మద్యంలో తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని షర్మిల ఆరోపించారు. కడప ఎంపీగా జగన్ మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారని, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని, అవినాష్ హత్య చేయించి నట్లు సీీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు.
Next Story