Sun Dec 22 2024 15:11:37 GMT+0000 (Coordinated Universal Time)
Ys Reddy : పెద్దిరెడ్డిపై ఫైర్ అయిన వైఎస్ షర్మిల
పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పీలేరు భారీ బహిరంగ సభ లో ఆమె ప్రసంగించారు
పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పీలేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పెద్ది రెడ్డిదే ఇక్కడ రాజ్యం అని అన్నారు. పెద్దిరెడ్డి ఏం చెప్తే అదే జరుుగుతందని, అవినీతి అంతా పెద్దిరెడ్డి దేనని షర్మిల అన్నారు. పీలేరు ఎమ్మెల్యే గంగిరెద్దు లా తల ఊపుడటమేనని, ఇలాంటి రబ్బర్ స్టాంప్ లకు మళ్ళీ అధికారం ఇవ్వాలా ? అని ఆమె ప్రశ్నించారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ నిలదీశారు. రాష్ట్రాన్ని పదేళ్లుగా బాబు,జగన్ లు మోసం చేశారన్నారు వైఎఎస్ షర్మిల.
రెండు పార్టీలూ...
ఇద్దరిలో ఒక్కరూ కూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయలేదని, ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని, హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని షర్మిల అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని పట్టుబట్టిన బాబు..హోదా అంటే జైల్లో పెట్టారని గుర్తు చేశార. ఎంపీ లు రాజీనామా చేస్తే ఎందుకు రాదో చూద్దాం అని జగన్ అన్నాడని, అధికారం లో వచ్చాక ఒక్క లో రాజీనామా చేయలేదన్నారు షర్మిల. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని షర్మిల అన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు . టీడీపి కి ఓటు వేసినా బీజేపీ కి వేసినట్లేనని, వైసిపి కి వేసినా బీజేపీ కి వేసినట్లేనని రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె అన్నారు.
Next Story