Mon Dec 23 2024 05:47:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అసెంబ్లీని కుదిపేసిన పెగాసస్
పెగాసస్ అంశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. పెగాసస్ అంశంపై చర్చ జరపాలని వైసీపీ పట్టుబట్టింది
పెగాసస్ అంశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. పెగాసస్ అంశంపై చర్చ జరపాలని వైసీపీ పట్టుబట్టింది. ఈ మేరకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు జారీ చేశారు. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడతామని స్పీకర్ ప్రకటించారు. పెగాసస్ అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుందని చెప్పారు.
చర్చకు పట్టు....
పెగాసస్ కొనుగోలుకు సంబంధించి లోకేష్ కూడా చెప్పారన్నారు. తమ వద్దకు ఈ అంశం వచ్చిందని అయితే తాము కొనుగోలు చేయలేదని చెప్పారని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఈ అంశంపై చర్చ జరగాలని ఆయన కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత చర్చ చేపడతామని స్పీకర్ ప్రకటించారు.
Next Story