Wed Dec 18 2024 18:37:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పార్థసారధికి టిక్కెట్ ఖరారు చేసిన టీడీపీ
పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధికి తెలుగుదేశం పార్టీ అధినేత నూజివీడు టిక్కెట్ ను కేటాయించినట్లు తెలిసింది
పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధికి తెలుగుదేశం పార్టీ అధినేత నూజివీడు టిక్కెట్ ను కేటాయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయనకు సమాచారం పంపినట్లు చెబుతున్నారు. పెనమలూరు నుంచి 2019 ఎన్నికల్లో వైసీీపీ అభ్యర్థిగా పోటీ చేసి పార్ధసారధి గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారు. కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను కూడా అధినాయకత్వం నియమించింది.
నూజివీడు టిక్కటె్...
పార్థసారధి తెలుగుదేశం పార్టీతో టచ్ లోకి వెళ్లారు. ఆయనతో టీడీపీ నేతలు చంద్రబాబు దూతలుగా వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు. అయితే పెనమలూరులో బోడె ప్రసాద్ ఆల్రెడీ ఉండటంతో ఆయనకు పార్టీ బలహీనంగా ఉన్న నూజివీడుటిక్కెట్ ను కేటాయించినట్లు తెలిసింది. నూజివీడులో గెలుపు కోసం కొన్ని సార్ల నుంచి టీడీపీ ప్రయత్నిస్తున్నా ఫలిత లేదు. బీసీ నేతగా పార్ధసారధికి ఈసారి నూజివీడు టిక్కెట్ ను కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పార్థసారధికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్ధసారధి వైైసీీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది.
Next Story