Mon Dec 23 2024 07:37:03 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 6వ తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరో తేదీ నాటికి అందరికీ పింఛన్లు అందచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
రెండు కేటగిరీలో...
రెండు కేటగిరీలుగా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఇంటివద్దకే వెళ్లి పింఛను అందచేయనున్నారు. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందడంతో అధికారులు దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ పంపిణీ కావాల్సిన పింఛన్ మూడు రోజులు ఆలస్యం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story