Tue Mar 25 2025 02:19:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ పింఛన్ల పంపిణీలో కొత్త మార్గదర్శకాలివే
ఆంధ్రప్రదేశ్ లో రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల మొదటి తేదీన పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది

ఆంధ్రప్రదేశ్ లో రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల మొదటి తేదీన పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే రేపటి నుంచి పంపిణీ చేయనున్న పింఛన్ల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పింఛన్లను తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మాత్రమే కాకుండా ఉదయం ఏడు గంటల నుంచి పంపిణీ చేయవచ్చని ఉత్తర్వులలో పేర్కొంది.
ఉదయం ఏడు గంటల నుంచి...
ఉదయం నాలుగు గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలంటే కష్టసాధ్యమని గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది చెప్పడంతో వారికి మూడు గంటల వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పింఛన్ల పంపిణీ ఎక్కువగా ఒకరోజులోనే పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అందుబాటులో లేని వారికి వారికి ఇళ్లలో బంధువులకు కూడా పంపిణీ చేసే వెసులుబాటు కల్పించింది. అలాగే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాలోనే దీనిని పైలట్ గా ప్రారంభించనున్నారు.
Next Story