Mon Dec 23 2024 08:30:02 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు వద్దకు టాలీవుడ్ పెద్దలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను టాలీవుడ్ నుంచి కొందరు కలవబోతున్నారని సమాచారం
రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను టాలీవుడ్ నుంచి కొందరు కలవబోతున్నారని సమాచారం. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కరంగా ఉండటంతో వీరిని కలిసి సినీ పరిశ్రమపై చర్చించనున్నారు. ప్రధానంగా టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో అనుమతివ్వాలని కోరనున్నారు.
టిక్కెట్ల ధరలను...
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలను అనుమతివ్వబోమని చెప్పారు. అదే సమయంలో టిక్కెట్ల ధరలకు కూడా ఇకపై అనుమతి ఇవ్వనని చెప్పడంతో కనీసం ఆంధ్రప్రదేశ్ లోనైనా ధరలను పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలకు అనుమతిని తీసుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు వీరిద్దరిని కలిసి చర్చించనున్నారు. సినీ పరిశ్రమకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఏపీ నుంచి కావడంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుండటంతో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story