Thu Dec 26 2024 14:14:28 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : చంద్రబాబూ నీ ఆస్తులు ఎవరికైనా పంచావా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్కక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్కక్తం చేశారు. చంద్రబాబు మీ ఆస్తులను ఏ ఒక్క ఆస్తి అయినా పంచారా? అని ప్రశ్నించారు. మీ చెల్లెళ్లకు, తమ్ముడికి ఆస్తులను పంచి పెట్టరా? అని నాని ప్రశ్నించారు. జగన్, భారతి తమ పేర్ల మీద ఉన్న ఆస్తులను వైఎస్ జగన్ అంతకు ముందే పంచి పెట్టారన్నారు. వైఎస్ షర్మిలకు పెళ్లయిన ఇన్నాళ్లకు, వైఎస్ తండ్రి చనిపోయిన ఇన్ని రోజులకు ఆస్తుల పంపకం విషయం వైఎస్ షర్మిలకు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ కు తల్లి మీద, చెల్లి మీద ప్రేమ ఉందని, కానీ శత్రువులతో చేతులు కలిపి జగన్ బెయిల్ రద్దు అయ్యేందుకు సహకరించేలా ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈడీ కేసులుండటతో....
2019లోనే వైఎస్ షర్మిలకు ఆస్తి ఇస్తున్నట్లు ఎంవోయూ రాసుకున్నారని అన్నారు. భారతి సిమెంట్ లో నలభై శాతం, సరస్వతి పవర్ లోనూ వాటా ఇస్తానని ఒప్పందంలో రాసుకున్నారని తెలిపారు. ఈడీ అటాచ్మెంట్ అయిపోయిన వెంటనే ఒప్పందం రాసుకున్నారని పేర్ని నాని తెలిపారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లన్నీ తన వద్దనే ఉంటాయని, ఈడీ కేసులన్నీ అయిపోయిన తర్వాత ఆస్తులను బదలాయిస్తానని తెలిపారని పేర్ని నాని గుర్తు చేశారు. ఆస్తులన్నీ ఈడీ అటాచ్ లో ఉన్న విషయం షర్మిలమ్మకు తెలియదా? అని నాని ప్రశ్నించారు. అవతల వాళ్ల ఇంట్లో ఆస్తుల గొడవతో నీకేంటి సంబంధమేంటని చంద్రబాబు ను పేర్ని నాని ప్రశ్నించారు.
Next Story