Mon Dec 23 2024 09:17:30 GMT+0000 (Coordinated Universal Time)
మేము ఛీకొట్టాం.. వాళ్లు తెచ్చుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ
టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. చంద్రబాబునాయుడికి సిగ్గు, శరం, మానాభిమానాలు ఏవీ లేవని ఆయన చర్యల ద్వారా అర్థమవుతుందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేశ్ గతంలో ప్రశాంత్ కిశోర్ గురించి ఏం మాట్లాడారో గుర్తు పెట్టుకోవాలని అన్నారు. బీహారోడు ఇక్కడికొచ్చి ఏం పీకుతాడు? బీహారోడి ఆట కట్టు, తోలు తీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారని.. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. బీహారోడికి ఇక్కడేం పని అని కూడా మాట్లాడారన్నారు. పవన్ కళ్యాణ్, టీడీపీ శ్రేణులపై చంద్రబాబు నమ్మకం కోల్పోయినట్టు కనిపిస్తోందని, అందుకే పీకేని తెచ్చుకున్నారని విమర్శించారు పేర్ని నాని.
జగన్ జనం గుండెల్లో ఉన్నారని, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి వైసీపీదే గెలుపు అని ఢంకా బజాయించారు. చంద్రబాబునాయుడికి సిగ్గు, శరం, మానాభిమానాలు ఏవీ లేవని ఆయన చర్యల ద్వారా అర్థమవుతుందన్నారు. మాకెవడి సలహాలు అక్కర్లేదు, మేం ప్రజలను నమ్ముకున్నాం అని లోకేశ్ అన్నాడని.. మరి ఇవాళ ఎవడ్ని నమ్ముకున్నారో చెప్పాలని అన్నారు పేర్ని నాని. మేం ఛీ కొడితే బయటికి వెళ్లినోడ్ని గతిలేక బతిమాలి తెచ్చుకున్నారు.. పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు. పార్టీ కార్యకర్తలను నమ్ముకునే పరిస్థితి లేదని ఈ పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోందని పేర్ని నాని అన్నారు.
Next Story