Mon Dec 23 2024 15:43:54 GMT+0000 (Coordinated Universal Time)
మావోడికి చెప్తున్నా అంటూ పేర్ని నాని కౌంటర్లు
ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ కేసుపై పేర్ని నాని మాట్లాడారు. ఈ కేసులో
ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ కేసుపై పేర్ని నాని మాట్లాడారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగానే మావోడు ఒకడు తగుదునమ్మా అని వచ్చాడు.. ఆదరబాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చాడు. జైలు వద్దకు వచ్చి ఆయన అంటాడు. జగన్ గారూ, మీకు తెలియదా సీఎం గారు మౌఖిక ఆదేశాలు ఇస్తారు తప్ప సంతకాలు పెట్టరని, ఇది తెలుసుకో అని అతను మాకు చెబుతున్నాడు. అరె బాబూ ఒకసారి ఎమ్మెల్యేగా గెలవరా బాబూ.. కనీసం కార్పోరేటర్‌గా గెలిస్తే ఎవరు ఎక్కడ సంతకాలు పెడతారో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవేనని అంటున్నారు.
ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. మావోడు జైలు వద్దకు వచ్చి చంద్రబాబు సంతకాలు పెట్టలేదని చెబుతున్నాడు, కానీ అదే చంద్రబాబు స్కిల్ కేసులో 13 చోట్ల సంతకాలు పెట్టారని తెలుసుకోవాలన్నారు. అధికారులు చెప్పినా వినలేదని, రూల్స్ గురించి చెప్పినా సంతకాలు మాత్రం పెట్టలేదని మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పేదల ఆశలను చంద్రబాబు అడియాసలు చేశారన్నారు. ఈ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెబుతోందని, కానీ డొల్ల కంపెనీల ప్రతినిధులను మాత్రం విచారణ సంస్థలు అరెస్ట్ చేశాయన్నారు. ఈ కేసులో స్కాం జరిగిందని ఈడీ కేసు ఎందుకు పెట్టిందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఆడించిన పాత్రదారులు అందరూ జైలుకు వెళ్లారని, ఇప్పుడు అసలు సూత్రదారి చంద్రబాబు వెళ్లారన్నారు.
Next Story