Sun Dec 29 2024 18:43:23 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీపై పేర్ని నాని నాన్ స్టాప్ ఫైర్
బీజేపీపై ఏపీ మంత్రి పేర్ని నాని నాన్ స్టాప్ గా ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
భారతీయ జనతా పార్టీపై ఏపీ మంత్రి పేర్ని నాని నాన్ స్టాప్ గా ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. బ్రాందీ ధరలు పెరిగిందుకు ఆందోళన చేస్తారా? అని పేర్ని నాని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించమని కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పేర్ని నాని కోరారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల రేట్లు ఎంత పెరిగాయో తెలుసా? అని పేర్ని నాని నిలదీశారు.
బాబు అజెండానే....
చంద్రబాబు అజెండానే బీజేపీ ఫాలో అవుతున్నట్లు కన్పిస్తుందని పేర్ని నాని అన్నారు. ఈరోజు జరిగే సభలో రాష్ట్ర విభజన హామీల అమలు, పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల పై మాట్లాడితే బాగుంటుందని పేర్ని నాని హితవు పలికారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే బీజేపీకి మాత్రం గిట్టడం లేదన్నారు. ఎన్నికలప్పుడే మోదీ బయటకు వచ్చే విషయాన్ని మర్చిపోయారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో పిలుపు వస్తే ఇక్కడ సభ పెడతారా? అని నిలదీశారు. పార్టీ మారి వచ్చిన వాళ్లు కూడా మాట్లాడేవారేనని నాని ఫైర్ అయ్యారు. ఏపీ అప్పు చేసిన మాట వాస్తవమేనని, దానికి లెక్కలున్నాయని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ మార్గదర్శకాలకు లోబడే అప్పులు చేస్తున్నామని పేర్ని నాని తెలిపారు.
- Tags
- perni nani
- bjp
Next Story