Thu Dec 19 2024 15:26:16 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ట్రాప్ లో నందమూరి కుటుంబం
చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను అసెంబ్లీలో ఎవరూ ప్రస్తావించలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు
చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను అసెంబ్లీలో ఎవరూ ప్రస్తావించలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. నందమూరి కుటుంబ సభ్యులు తప్పుదోవ పట్టారన్నారు. ఎవరి పేర్లను ప్రస్తావించకుండానే వైసీపీ నేతలపై ఎలా విమర్శలు చేస్తారని పేర్ని నాని ప్రశ్నించారు. అసెంబ్లీలో చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేశారన్నారు. నాడు ఎన్టీఆర్ ను కూలదోసినప్పుడు ఈ నందమూరి కుటుంబ సభ్యులను చంద్రబాబు తప్పుదోవ పట్టించారన్నారు. తమలో ఎన్టీఆర్ రక్తం ప్రవహిస్తుందని చెప్పుకునే కుటుంబ సభ్యులు నాడు ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు ఏం చేశారని నిలదీశారు.
అనుభవాన్ని ఇలా....
వాస్తవాలు మాట్లాడితే అనుభవానికి పరమార్థం ఉంటుందని చంద్రబాబుకు పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. గొడవకు కారణం మీరయితే, వైసీపీపై నిందలు మోపారన్నారు. అసెంబ్లీలో ఎవరి ప్రస్తావన రాకపోయినా చంద్రబాబు సృష్టించారన్నారు. తమకు సంస్కారం ఉందని, తాము ఏమీ అనకపోయినా అనని మాటలు అన్నట్లు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర రాజకీయాలను చంద్రబాబు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని పేర్ని నాని అన్నారు. దేశ వ్యాప్తంగా రైతుల విజయానికి గుర్తుగా వైసీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తున్నామని పేర్ని నాని తెలిపారు. బాలకృష్ణ ఒక అమాయకుడని, ఆయనకు మరోసారి చెబుతున్నామని, ఎవరి ప్రస్తావన కూడా అసెంబ్లీలో తేలేదని, తమకు అక్క చెల్లెళ్లు, భార్యా పిల్లలు ఉన్నారని పేర్ని నాని తెలిపారు.
Next Story