Fri Dec 27 2024 22:05:57 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీకి ఎమ్మెల్యే రాజీనామా
వైసీపీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు.
వైసీపీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయనవైసీపీకి పార్టీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నానని చిట్టిబాబు తన రాజీనామా లేఖలో వెల్లడించారు.
కాంగ్రెస్ లో చేరి...
చిట్టిబాబు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పి. గన్నవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. పి. గన్నవరం సీటు కోసం చివరి వరకూ ప్రయత్నించిన చిట్టిబాబు తనకు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Next Story