Wed Apr 02 2025 09:13:49 GMT+0000 (Coordinated Universal Time)
పరీక్షలు రాసిన కాకాణి గోవర్థన్ రెడ్డి
విక్రమ సింహపురి యూనివర్సిటీ నిర్వహించిన పి.హెచ్.డి. కోర్సు పరీక్షలకు కాకాణి గోవర్థన్ రెడ్డి హాజరయ్యారు.

చదువు మీద ధ్యాస, శ్రద్ధ ఉంటే అందుకు వయసు, పదవులు అడ్డురావు. చదువుకోవాలని, అనేక డిగ్రీలు సాధించాలన్న తపన ఇప్పటికీ అనేక మందిలో ఉంటుంది. పేరు వెనక డిగ్రీల జాబితాను చూసుకుని మురిసిపోయే వారు ఎందరో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా పరీక్షలు రాస్తూ అందరినీ ఆశ్యర్యపరిచే వారు అనేక మంది ఉన్నారు. వారిలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఒకరు.
బిజీగా ఉన్నా.....
కాకాణి గోవర్థన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనకు క్షణం తీరిక ఉండదు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పైగా ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కూడా కాకాణి వ్యవహరిస్తున్నారు. ఇంత బిజీ సమయంలోనూ ఆయన పరీక్షలు రాశారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ నిర్వహించిన పి.హెచ్.డి. కోర్సు పరీక్షలకు కాకాణి గోవర్థన్ రెడ్డి హాజరయ్యారు.
Next Story