Fri Apr 11 2025 03:32:43 GMT+0000 (Coordinated Universal Time)
పిడుగురాళ్లు మున్సిపల్ వైస్ ఛైర్మన్ టీడీపీ ఖాతాలో
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుచుకుంది

పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుచుకుంది. రెండుసార్లు కోరం లేక వాయిదా పడిన ఎన్నిక ఈరోజు జరగడంతో ఈరోజు కూడా కోరంకు సరిపడా కౌన్సిలర్లు హాజరవుతారా? లేదా? అన్న అనుమానం వ్యక్తమయింది. కానీ వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన వారితో మున్సిపల్ం సమావేశంలో కోరం మేరకు సభ్యులు హాజరయ్యారు.
కోరానికి సరిపడా...
పిడుగు రాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉండగా ఈరోజు ఎన్నికకు పదిహేడు మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. టీడీపీకి చెందిన పున్నం భారతిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. దీంతో పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నట్లయింది. వరసగా ఏపీలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా పాతుతోంది.
Next Story