Mon Dec 23 2024 02:40:31 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ బోర్డు సభ్యులుగా ఆ ముగ్గురినీ తొలగించండి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం పిల్ దాఖలైంది. నేర చరిత్ర ఉన్న మద్యం వ్యాపారులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డిల నియామకాలను ఆయన సవాల్ చేశారు. వీరిని టీటీడీ బోర్డు సభ్యులుగా తొలగించాలని.. ఇది కోట్లాది మంది వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని అన్నారు.
టీటీడీ సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ ఈ ముగ్గురి టీటీడీ బోర్డు సభ్యత్వం తొలగించాలని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ లో కోరారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను నియమించింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను, ప్రముఖ వ్యక్తుల కోటాలో కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డిలను నియమించింది. ఈ సభ్యులను ఎంపికపట్ల పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. టీటీడీ సభ్యులుగా ఉండేందుకు వారు అనర్హులు అని.. టీటీడీ సభ్యులుగా వారి నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోర్టు ఏ తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
Next Story