Mon Dec 23 2024 01:40:47 GMT+0000 (Coordinated Universal Time)
Pithapuram : పిఠాపురం వాసులకు గుడ్ న్యూస్.. ఇక తిరుగేముంది బాసూ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. అసలు పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేయడం, అక్కడ సొంత ఇల్లు కొనుగోలు చేయడంతోనే భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. గతంలో నాలుగు ఎకరాలు అమ్మి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడు అర ఎకరం విక్రయిస్తే వివాహం పూర్తవుతుందని అక్కడ భూముల యజమానులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో రెండు రాష్ట్రాల్లో అది హాట్ టాపిక్ గా మారింది. పిఠాపురం టూరిజం ప్లేస్ గా తయారవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
స్థలాన్ని కొనుగోలు చేయడంతో....
పవన్ కల్యాణ్ పోటీ చేసినప్పటి నుంచే పిఠాపురానికి క్రేజ్ పెరిగింది. అందులో ఆయన అక్కడ ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయడంతో మరింత భూముల ధరలు ఊపందుకున్నాయి. అప్పటి నుంచి ఇక పిఠాపురంలో భూముల ధరలు తగ్గడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే విజయవాడ భూముల ధరలతో పోటీ పడుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బిల్డర్లు కూడా రెడీ అయ్యారు. అపార్ట్మెంట్లు కట్టి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురంలో ఇక హోటళ్లు, లాడ్జీలు కూడా పెద్దయెత్తున వెలిశాయి. గతంలో లేని సదుపాయాలన్నీ హోటళ్లలో కల్పిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు.
అపోలో ఆసుపత్రి నిర్మాణం కోసం...
తాజాగా పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మాణానికి అంతా సిద్ధమయింది. రామ్చరణ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా అపోలో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రామ్ చరణ్ పిఠాపురంలో పది ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు. ఈ భూమిలో అపోలో ఆసుపత్రిని నిర్మించనున్నారు. మల్టీ స్పెషాలిటీ హంగులతో ఈ ఆసుపత్రిని నిర్మించబోతున్నారని తెలిసింది. ీ మేరకు చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు ప్రకటించారు. పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రావడంతో ప్రజల ఆరోగ్యంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల వారికి...
పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మాణం జరిగితే చుట్టు పక్కల ప్రాంతాల వారికి కూడా వైద్యం కోసం వచ్చే అవకాశముంది. దీంతో పిఠాపురం దశ తిరగనుందని చెబుతున్నారు. ఇన్నాళ్లూ ఇన్నేళ్లు పిఠాపురానికి పట్టని మహర్దశ పవన్ కల్యాణ్ పోటీతో మరిన్ని సొబగులు అద్దుకుంటుంది. మరో కాకినాడ పట్టణంలా పిఠాపరం మారే అవకాశం ఎంతో దూరం లేదని స్థానికులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పిఠాపురం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడంతో ఇక అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పవన్ తన వంతుగా, డిప్యూటీ సీఎంగా ప్రయత్నం చేస్తే మరింత అభివృద్ధి చెందకమానదు. సో . పిఠాపురం వాసులూ.. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి.
Next Story