Wed Apr 02 2025 22:04:12 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంవో నుంచి ఎమ్మెల్యేకు పిలుపు.. ఏం జరుగుతుందో?
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పిలుపు వచ్చింది

తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పిలుపు వచ్చింది. వెంటనే ఆయనను తాడేపల్లికి బయలుదేరి రావాలని కోరింది. ఇప్పటికే కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతను పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా అధినాయకత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పెండెం దొరబాబు గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఎంపీగా పోటీ చేయాలని...
అయితే నేడు పెండెం దొరబాబుతో పాటు ఆ జిల్లా పార్టీ ఇన్ఛార్జి మిధున్ రెడ్డికి కూడా పిలుపు వచ్చింది. పెండెం దొరబాబును కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే చెప్పిందని తెలిసింది. అయితే అందుకు దొరబాబు సుముఖంగా లేరని, ఆయన పిఠాపురం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు పిలుపురావడం ఆసక్తికరంగా మారింది. వంగా గీత కూడా ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story