Sun Apr 13 2025 08:38:14 GMT+0000 (Coordinated Universal Time)
పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టులో
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా గాలిలోనే విమానాలు చక్కర్లు కొడుతున్నాయి

గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా గాలిలోనే విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం దాదాపు గంట సేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది.
భయాందోళనలో...
దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనలకు గురయ్యారు. ప్రతి రోజూ పొగమంచు ఎక్కువగా ఉండటంతో విమానాలు రన్ వే పై దిగడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఏ విమానం ల్యాండ్ కాకుండా తిరిగి వెనక్కు వెళ్లలేదు. పొగమంచు విమానాల రాకపోకలకు అంతరాయంగా మారింది.
Next Story