Mon Dec 23 2024 18:20:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రాజీవ్ స్వగృహ ప్లాట్ల కేటాయింపు
హైదరాబద్ లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను నేటి నుంచి లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు
Hyderabad : హైదరాబద్ లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను నేటి నుంచి లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. మరికాసేపట్లో లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. బండ్లగూడలోని 2,246 ప్లాట్లకు 33,161 దరఖాస్తులు వచ్చాయి. పోచారంలోని 1,470 ప్లాట్లకు 5,921 అప్లికేషన్లు వచ్చాయి. ఎక్కువగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు భారీ స్పందన లభించింది. ఈ డీలక్స్ ప్లాట్ల కోసం 166,679 మంది దరఖాస్తు చేసుకున్నారు.
భారీ స్పందన...
మరికాసేపట్లో లాటరీ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈరోజు పోచారం, రేపు బండ్లగూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూం లకు సంబంధించి లాటరీ నిర్వహించనున్నారు. ఒక వ్యక్తికి ఒక ప్లాట్ ను మాత్రమే కేటాయించనున్నారు. లాటరీ వ్యవహారాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. భారీ స్పందన రావడంతో లాటరీ తీస్తున్నందున అక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story