Fri Nov 22 2024 10:13:30 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం
పోలవరం పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది.
పోలవరం పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది.
నలుగురు నిపుణులు...
అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణులు బృందం సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు, పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. నేటి నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు.
Next Story