Sun Dec 22 2024 20:53:33 GMT+0000 (Coordinated Universal Time)
Attack On Ys Jagan : నిందితుడి వివరాలు చెబితే భారీ నజరానా.. ప్రకటించిన బెజవాడ పోలీసులు
వైఎస్ జగన్ పై దాడిచేసిన వారి నిందితుడు వివరాలు తెలిపితే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడిచేసిన వారి నిందితుడు వివరాలు తెలిపితే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఎవరు చెప్పినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, తమకు సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు దానిని అందచేయాలని విజయవాడ పోలీసులు కోరారు. దీంతో జగన్ పై దాడి ఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టినట్లు అర్థమవుతుంది.
గోప్యంగా ఉంచుతాం...
నిందితులు ఎవరైనా తమకు సమాచారం తెలిస్తే పోలీసు అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని కోరారు. ఈ ప్రకటనతోనైనా నిందితుడు ఎవరో దొరుకుతాడని పోలీసులు భావిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన సమయంలో అక్కడ విద్యుత్తు లేకపోవడం, సీసీ టీవీ వైర్లు కూడా కట్ కావడంతో ఈ విధమైన బహుమతిని పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే దీనిపై సిట్ ను ఏర్పాటు చేశారు.
Next Story