Mon Dec 23 2024 04:05:02 GMT+0000 (Coordinated Universal Time)
Palnadu : పల్నాడులో కొనసాగుతున్న హింస.. అదనపు బలగాలు
పల్నాడు లో ఎన్నికల అనంతరం జరుగుతున్న ఘర్షణలతో పోలీసులు అదనపు బలగాలను దించుతున్నారు
పల్నాడు జిల్లాలో హింస చెలరేగుతుంది. ఎన్నికల అనంతరం జరుగుతున్న ఘర్షణలతో పల్నాడు మరింత వేడెక్కింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను దించుతున్నారు. ఎనిమిది మంది కేంద్ర బలగాలను పల్నాడు జిల్లాకు పంపారు. ఇప్పటికే అక్కడ మొహరించిన పోలీసులతో పాటు అదనంగా ఈ బలగాలు పల్నాడుకు చేరుకుని శాంతిభద్రతలను పరిస్థితిని సమీక్షించనున్నాయి. అదనపు బలగాలతో పల్నాడు వీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు.
144 సెక్షన్
పల్నాడు జిల్లాల్లో ఇప్పటికే అనేక చోట్ల 144 సెక్షన్ విధించారు. ముగ్గురికి మంచి కనిపిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎన్నికల అనంతరం టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పల్నాడుకు ప్రత్యేక బలగాలను ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పంపారు. పరిస్థిితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Next Story