Mon Dec 23 2024 00:07:33 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నకిలీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు బయలు దేరారు. మద్యం మరణాలపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రేపల్లె కు వెళ్లనివ్వకుండా...
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎందుకు వెళ్లనివ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రేపల్లెలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
Next Story