Sun Dec 22 2024 14:32:34 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని అరెస్ట్ చేయనున్నారా? ఆయన ఎక్కడున్నారు?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తున్నారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకుని మూడు ప్రత్యేక బృందాలు ఆయన కోసం వెళ్లాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గన్నవరం ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ తన కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారని చెబుతున్నారు. అయితే వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నారా? లేక అమెరికా వెళ్లారా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆయన కోసం మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
టీడీపీ కార్యాలయంపై...
వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడి కేసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నాడు ఎమ్మెల్యేగా ఉండి తన అనుచరులను రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ కేసును బయటకు వెలికి తీశారు.
కొత్త ప్రభుత్వం రావడంతో...
అప్పటి నుంచి ఆయన కోసం వెదుకులాట ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఈ ఘటననలో బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించడంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గత నెల 9వ తేదీన కొందరిని ఈ కేసులో అరెస్ట్ చేసినప్పుడే వంశీని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే టీడీపీ దాడి కేసులో పాల్గొన్న కొందరు వైసీపీ కార్యకర్తలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయాలని నిర్ణయించి ఆయన కోసం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు వెళ్లాయి.
Next Story