Mon Dec 23 2024 14:30:46 GMT+0000 (Coordinated Universal Time)
నారా చంద్రబాబు, లోకేశ్ లపై కల్యాణదుర్గం పీఎస్ లో కేసు నమోదు
అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం పీఎస్ లో వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. అందుకు కారణం వారు సోషల్ మీడియాలో..
అనంతపురం : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం పీఎస్ లో వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయి. అందుకు కారణం వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే. ఇటీవల మంత్రి ఉషా శ్రీ చరణ్ పర్యటన నేపథ్యంలో.. ఆస్పత్రికి వెళ్తున్న చిన్నారి ట్రాఫిక్ లో చిక్కుకుని మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు ఇద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగానే వారిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చిన్నారి మృతి పై చంద్రబాబు, లోకేశ్ లు అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారని భాస్కర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చంద్రబాబు, లోకేశ్ లపై కేసులు నమోదు చేశారు.
Next Story