Mon Dec 23 2024 03:16:20 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఎమ్మెల్యే రాచమల్లుపై పోలీసు కేసు
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్ రెడ్డిపై పోలీసులుకేసు నమోదు చేశారు.
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్ రెడ్డిపై పోలీసులుకేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంగళవారం అనుమతి లేకుండా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ర్యాలీ నిర్వహించడంపై ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాలీకి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉండగా, ఆయన ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించారని...
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటుగా వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, ఆయన కుమారుడు సురేష్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ మేరకు నడచుకోకుంటే ఎవరిపైనేనా పోలీసులు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Next Story