Sat Apr 12 2025 08:21:25 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియకు ఆ కేసులో?
మాజీ మంత్రి అఖిలప్రియ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు

మాజీ మంత్రి అఖిలప్రియ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగద్విఖ్యాతరెడ్డిలు ఉన్నారు. ఐటీ అధికారుల సోదాల పేరుతో పారిశ్రామికవేత్తలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసును వెంటనే పోలీసులు ఛేదించారు.
జైలు శిక్ష....
ల్యాండ్ ఇష్యూలో ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ కు సూత్రధారి అఖిలప్రియ అని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె చంచల్గూడ జైలులో శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈకేసుకు సంబంధించి పోలీసులు ఛార్జిషీటు నమోదు చేశారు. అఖిలప్రియను నిందితురాలిగా చేర్చారు.
Next Story