Mon Dec 23 2024 09:52:22 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడులో వైసీపీ నేత హత్యకు కుట్ర భగ్నం
పల్నాడులో వైసీపీ నేతను చంపడానికి టీడీపీ నేతలు వేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు
పల్నాడులో వైసీపీ నేతను చంపడానికి టీడీపీ నేతలు వేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్ది మండలం వైసీపీ ఎంపీపీ చింతా శివరామయ్య హత్యకు స్థానిక టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. గురజాల సబ్ జైలులో ఉన్న హంతకులతో డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ విషయం కిరాయి హంతకుడు గాలయ్యను అదుపులోకి తీసుకున్న తర్వాత వెల్లడయింది.
అడ్వాన్స్ తీసుకునేందుకు....
వెల్లుర్ది మండల ఎంపీపీ చింతా శివరామయ్యను హత్య చేసేందుకు స్థానిక టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఇందుకోసం అడ్వాన్స్ తీసుకునేందుకు వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు గాలయ్య వచ్చారు. అనుమానించిని పోలీసులు గాలయ్యను అరెస్ట్ చేసి విచారించగా ఈ ప్లాన్ బయటపడింది. ఈ కేసులో గాలయ్యతో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story