Mon Dec 23 2024 13:58:42 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై నేను రాయి విసరలేదు
తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో రాయి విసిరిన మాట వాస్తవం కాదని పోలీసులకు చిక్కిన నాగేశ్వరావు తెలిపారు
తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో రాయి విసిరిన మాట వాస్తవం కాదని పోలీసులకు చిక్కిన నాగేశ్వరావు తెలిపారు. నాగేశ్వరరావుది గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి. తెనాలిలో పవన్ కల్యాణ్ పర్యటనకు రావటంతోనే ఆయన నుంచి షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో తన చేయి తగిలిందని, తనపై వారి బంధువులు దాడి చేయడంతో దాన్ని రాయి దాడిగా మార్చారాని నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు.
షేక్ హ్యాండ్ కోసం...
తన చేయి మహిళకు తగిలితే ఆ ఘటనను రాయి విసిరిన ఘటనగా మార్పు చేశారని దాడిలో గాయపడిన వ్యక్తే స్వయంగా తెలియజేశారని పోలీసులు తెలిపారు. ఆయన చెప్పింది వాస్తవమేనని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు నాగేశ్వరరావును విచారించి వదిలేసినట్లు తెలిసింది. నిన్న తెనాలిలో పవన్ పై రాయి దాడి జరిగిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.
Next Story