Sun Dec 22 2024 22:19:56 GMT+0000 (Coordinated Universal Time)
మార్గాని భరత్ ప్రచార రధాన్ని తగులపెట్టిన వ్యక్తి అరెస్ట్.. వైసీపీ కార్యకర్త పనే
రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్దం చేసిం వైసీపీ కార్యకర్తేనని పోలీసులు తేల్చారు.
రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్దం చేసిం వైసీపీ కార్యకర్తేనని పోలీసులు తేల్చారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రచార రథాన్నిరాజమహేంద్రవరం వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీ దగ్దం చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. కొన్నేళ్ల నుంచి వైసీపీ కార్యకర్త మాత్రమేగా కాకుండా మార్గాని నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడుగా ఉన్న శివాజీ భరత్ కార్యాలయం ఉన్న మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోనే ఎక్కువ సమయం ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్ ఓడి పోవడంతో ఆవేదన చెందాడని, ఎలాగైనా ఏదో ఒకటి చేసి టీడీపీ వాళ్లపైకి నెపం నెట్టేయాలని, భరత్‌పై ప్రజల్లో సానుభూతి వచ్చే విధంగా చేయాలని పథకం వేసి ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారం...
పోలీసులు శివాజీని అరెస్ట్ చేశారు. గత నెల 28న శివ మరికొంతమంది కలిసి రాత్రి 10 గంటల వరకూ మార్గాని ఎస్టేట్స్‌లోని రచ్చబండ వద్ద మద్యం తాగిన తర్వాత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన బైక్ నుంచి శివ ఒక ప్లాస్టిక్ కవర్లోకి పెట్రోలు తీసి దానిని తీసుకొని ప్రచార రథం వద్దకు వెళ్లాడు. ఎదుటవైపు టైరుపై పెట్రోలు ఉన్న కవర్ని ఉంచి.. దానిపై అగ్గిపుల్ల వేసి అంటించారని తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేవలం మార్గాని భరత్ పై సానుభూతి వచ్చేందుకే శివాజీ ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. అతనిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Next Story