Thu Dec 19 2024 23:05:05 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్
తెలుగుదేశం పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
తెలుగుదేశం పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నాటుసారా మరణాలపై ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి టీడీపీ పిలుపునివ్వడంతో ముందస్తు జాగ్రత్తలను పోలీసులు తీసుకున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 25 మంది నాటుసారా తాగి మరణించారని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే అవి సహజమరణాలేనని, టీడీపీ రాజకీయం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ముట్టడికి పిలుపునివ్వడంతో.....
ఈ నేపథ్యంలో టీడీపీ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గద్దె రామ్మోహన్, అచ్చెన్నాయుడులతో పాటు దేవినేని ఉమ, బొండా ఉమ తదితరుల ఇళ్లవద్ద పోలీసులు నిఘా పెట్టారు.
Next Story