Tue Nov 05 2024 05:27:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విజయవాడలో జగన్ పై దాడి కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. అతను సింగ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. అతను సింగ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఐదుగురు యువకులు జగన్ పై దాడిచేసిన వారి పేరును కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. సీసీఎస్ పోలీసులు వీరిని విచారిస్తున్నారు. మొత్తం ఐదుగురిలో ఒక యువకుడు జగన్ పై రాయి దాడికి దిగినట్లు తెలిసింది. దాడి జరిగిన సమయంలో ఈ ఐదుగురు యువకులు వివేకానంద స్కూల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
టైల్స్ కు వినియోగించే...
వీరిని అత్యంత గోప్యంగా విచారిస్తున్నారు. అయితే ఫుట్పాత్ మీద వినియోగించే టైల్స్ కు వినియోగించే రాయిని దాడికి ఉపయోగించినట్లు ఆ యువకుడు చెప్పినట్లు సమాచారం. ఆ రాయి షార్ప్ గా ఉండటంతో పాటు గాయం కూడా తగులే అవకాశముండటంతో దానినే ఆ యువకుడు ఉపయోగించినట్లు చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్ ఫ్లై ఓవర్ సమీపంలో ఫుట్ పాత్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వాడే టైల్స్ ను జగన్ పై దాడికి వినియోగించినట్లు తెలిసింది.
రాయిని జేబులో వేసుకుని...
అధికారికంగా ఇంకా పోలీసులు ప్రకటించకపోయినా ఈ దాడికి పాల్పడింది మాత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకుడే అన్నది నిర్ధారణ అయింది. అయితే వీళ్లు ఐదుగురు యువకులు ఎందుకోసం దాడికి ప్రయత్నించారు? వీరి వెనక ఎవరైనా ఉన్నారా? లేక ఆకతాయిగా ఈ పనికి పాల్పడ్డారా? అన్న దానిపై మాత్రం ఇంకా విచారణ సాగుతోంది. రాయిని జేబులో వేసుకుని జగన్ పర్యటించే ప్రాంతంలో ఉన్న వివేకానంద స్కూలుకు చేరుకున్న ఈ యువకుల బృందంలో ఒకడు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులయితే ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. వీరు విసిరింది ఒక రాయి మాత్రమేనని, అది ముందు జగన్ కు తగలి ఆ తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిలిందని పోలీసులు ప్రాధమిక విచారణలో వెల్లడయింది.
Next Story